తెలంగాణ

telangana

ETV Bharat / state

సూది బెజ్జంలో ట్రంప్‌.. అభిమాని కళారూపం - warangal urban district latest news today

అభిమానానికి హద్దులు లేవు.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై అభిమానంతో జనగామ జిల్లాలో ఓ వ్యక్తి విగ్రహం కట్టి పూజించగా.. తాజాగా వరంగల్ పట్టణ జిల్లాకు ఓ కళాకారుడు సూది బెజ్జంలో పట్టె ట్రంప్‌ అతి సూక్ష్మ రూపాన్ని తయారు చేశాడు.

A favorite to include Trump in a needle hole at girmajipetm warangal urban district
సూది బెజ్జంలో ట్రంప్‌ను చేర్చిన అభిమానం

By

Published : Feb 25, 2020, 5:51 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన ఓ కళాకారుడు సూక్ష్మ కళాకృతిని తయారు చేసి తన అభిమానాన్ని చాటారు. గిర్మాజీపేటకు చెందిన మట్టెవాడ అజయ్ కుమార్ సూది బెజ్జంలో అమెరికా జెండాతోపాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిమను రూపొందించాడు.

1.25 మిల్లీ మీటర్ల ఎత్తు, 0.32 వెడల్పుతో ట్రంప్‌ అతి సూక్ష్మ రూపాన్ని, 0.94 మిల్లీమీటర్ల పొడవు, 0.64 వెడల్పుతో అమెరికా జాతీయ జెండాను సైతం తీర్చిదిద్దారు. 13 గంటల పాటు శ్రమించి ఈ సూక్ష్మ కళాకృతి రూపొందించినట్లు పేర్కొన్నాడు.

సూది బెజ్జంలో ట్రంప్‌ను చేర్చిన అభిమానం

ఇదీ చూడండి :భాగ్యనగర శివారులో భారీగా పసిడి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details