ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వివిధ రకాల పుష్పాలతో పూజలు చేసి అనంతరం నీమాత్రా క్రమంలో అలంకరించారు.
భద్రకాళి ఆలయంలో 9వ రోజుకు చేరిన శాకంబరి ఉత్సవాలు - 9th day shakambari utsav at bhadrakali temple in warangal district
వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిలిపివేసినట్లు అర్చకులు తెలిపారు.
భద్రకాళి ఆలయంలో 9వ రోజుకు శాకంబరి ఉత్సవాలు
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయడం పూర్తిగా నిలిపివేశామని ఆలయ అర్చకులు వివరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేశాక.. మాస్కులుంటేనే లోనికి అనుమతిస్తున్నారు.