ఆస్తుల వివరాల నమోదు లక్ష్యాన్ని శరవేగంగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని 47వ డివిజన్ టీవీ టవర్ కాలనీ, 39 డివిజన్ బాల సముద్రం ప్రాంతాలను కమిషనర్ ఆకస్మికంగా సందర్శించి నమోదు ప్రక్రియను పరిశీలించారు.
వరంగల్లో 80 శాతం ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి: పమేలా సత్పతి
ఆస్తుల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించి సర్వే జరిగే తీరును ఆమె పరిశీలించారు.
వరంగల్లో 80 శాతం ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి: పమేలా సత్పతి
ఆస్తుల వివరాలను తప్పులు లేకుండా పటిష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి ఆస్తికి ప్రభుత్వం నాన్ అగ్రికల్చర్ పట్టా పుస్తకం అందిస్తుందన్నారు. గ్రేటర్ పరిధిలో 2,12,359 గృహాలకు గాను నేటి వరకు 1,71,189 ఇళ్ల వివరాలను ధరణి యాప్లో నమోదు చేశామని... మిగిలిన 41,170 ఆస్తుల నమోదు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు 80 శాతం నమోదు ప్రక్రియ పూర్తైందని తెలిపారు.
ఇదీ చూడండి:ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఉన్నట్టా..లేనట్టా?
TAGGED:
dharani survey in warangal