78 Students Suspended For Ragging in Kakatiya University : వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌కు పాల్పడిన 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు వసతి గృహాల నుంచి సస్పెండ్ చేశారు. విశ్వ విద్యాలయం చరిత్రలో ఇంత మంది విద్యార్థులను ఒకేసారి సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. ఈ నెల 20న కేయూలో విద్యార్థుల ర్యాగింగ్ బయటపడింది. వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు పరిచయాల పేరుతో ర్యాగింగ్‌కు పాల్పడుతున్న పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని గుర్తించారు.
Director Of KU Said Take Action Against Ragging : ప్రధానంగా పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినుల వివరాలను సేకరించారు. అన్ని విభాగాల్లోనూ ఈ ర్యాగింగ్భూతం విస్తరించినట్లు గుర్తించారు. వాణిజ్య శాస్త్రం, జంతుశాస్త్రం, ఆర్థిక శాస్త్రం విభాగాల్లోని మొత్తం 78 మంది విద్యార్థినీ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు కేయూ వసతి గృహాల సంచాలకుడు ఆచార్య వై.వెంకయ్య వెల్లడించారు. ఇంకెవరైనా ర్యాగింగ్‌కు(Ragging) పాల్పడ్డారా అనే వివరాలు సేకరిస్తున్నామని, సరైన ఆధారాలు లభిస్తే వారినీ సస్పెండ్ చేస్తామన్నారు.