హనుమకొండలో 60వ జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలు రెండోరోజు ఆద్యంతం కోలాహలంగా సాగుతున్నాయి. ఉరిమే ఉత్సాహంతో క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. పతకాల కోసం పోటాపోటీగా తలపడుతున్నారు. జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో 20 కిలో మీటర్ల వాక్ నిర్వహించారు. ఈ వాక్‌లో పురుషుల విభాగంలో ఉత్తరాఖండ్‌కు చెందిన చందన్ సింగ్ విజయం సాధించారు. మహిళల విభాగంగలో రాజస్థాన్‌కు చెందిన సొనల్ సుక్వల్ విజయం సాధించారు. వీరికి నిట్ సంచాలకులు ఎన్వీ రమణరావు పథకాలను అందజేశారు. పోటీల్లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని క్రీడకారులు హర్షం వ్యక్తం చేశారు.
National athletic championship: కోలాహలంగా జాతీయ అథ్లెటిక్ పోటీలు - తెలంగాణ వార్తలు
60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల సందర్భంగా హనుమకొండ జె.ఎన్.ఎస్. మైదానం క్రీడాకారులతో కళకళలాడుతోంది. మొదటి రోజు అదరగొట్టిన క్రీడాకారులు... రెండో రోజు సైతం అదే ఉత్సాహం చూపిస్తున్నారు. తమ సత్తా నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 27 మంది అథ్లెట్లతో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన 573 మంది క్రీడాకారులు పోటీల్లో పతకాల కోసం పోటీ పడుతున్నారు. అథ్లెటిక్ సంఘాల తరఫున 253 మంది ప్రతినిధులూ.. ఈ పోటీలకు హాజరవుతున్నారు. వంద, 200 వందల మీటర్ల పరుగు, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, షాట్ పుట్, రేస్ వాక్, మిక్స్డ్ రిలే తదితర 48 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. మైదానంలో రూ.7 కోట్ల 86 లక్షలతో క్రీడాకారుల కోసం రూపుదిద్దుకున్న సింథటిక్ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇదీ చూడండి:National athletic championship: హనుమకొండలో జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలు