ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం మొత్తం 54 మంది వైరస్ బారిన పడ్డారు. జిల్లాల వారీగా చూస్తే వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 30 కేసులు నమోదయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో 2, జనగామలో 4, ములుగులో ఆరుగురికి వైరస్ సోకింది. భూపాలపల్లి జిల్లాలో 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - వరంగల్లో కరోనా కేసులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం 54 మందికి కరోనా నిర్ధారణ అయింది. లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కేసులు పెరుగుతుండంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

coronavirus
పాజిటివ్ నిర్ధారణ అయినా లక్షణాలు లేని వారిని హోం ఐసోలేషన్లో ఉంచుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ