విద్యుత్ స్తంభం కూలి నాలుగు పాడిగేదెలు మృత్యువాత పడిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం మడికొండలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన దండిగం సమ్మయ్య అనే వ్యక్తి తన గేదేలను ఊరి బయటకు మేతకు తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం విద్యుత్ స్తంభం కూలింది. తీగలు తెగి విద్యుదాఘాతంతో గేదెలు మృతి చెందాయి.
మడికొండలో విద్యుదాఘాతం... 4గేదెలు మృతి - విద్యాదాఘాతంతో గేదెలు మృతి
వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతి చెందాయి. మేతకు వెళ్లిన గేదేలపై స్థానికంగా ఉన్న విద్యుత్ స్తంభం కూలి ఘటన జరిగింది. తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మడికొండలో విద్యుదాఘాతం... 4గేదెలు మృతి
ఒక్కో గేదేను రూ.45 వేల పెట్టి కొనుగోలు చేశామని... వాటి మృతితో తాము తీవ్రంగా నష్టపోయామని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:మహానగరంలో మళ్లీ భూప్రకంపనలు..!