మహిళా దినోత్సవం సందర్భంగా 3కె రన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ పట్టణంలో 3కె రన్ నిర్వహించారు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు పెద్దఎత్తున మహిళలు పరుగు తీశారు. ఫిట్ ఇండియా పౌండేషన్, శ్రావ్య ఫిట్నెస్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మైదానంలో యువతులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని శ్రావ్య ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకురాలు శ్రావ్య ఆకాంక్షించారు.
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.