వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవాన్ని తిలకిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఉగాది సందర్భంగా ఐనవోలులో 36 ఫీట్ల పెద్ద పట్నం - 36 feet pedda patnam in Ainavolu
వరంగల్ అర్బన్ జిల్లాలో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. వేడుకను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మొట్టమొదటిసారిగా ఉగాది సందర్భంగా ఆలయంలో ఒగ్గు పూజారులు రంగవల్లులతో 36 ఫీట్ల పట్నం వేశారు.
ఐనవోలులో పెద్దపట్నం
సంక్రాంతి, శివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో పెద్ద పట్నాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా.... తొలిసారిగా ఉగాదిని పురస్కరించుకుని 36 ఫీట్ల విస్తీర్ణంలో పెద్ద పట్నం వేశారు. 60 మంది ఒగ్గు పూజారులు రంగవల్లులతో చూడచక్కగా వేసిన పట్నాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి:మండు వేసవి కాలంలోనూ తాగు, సాగు నీటికి ఇబ్బంది లేదు: హరీశ్‌రావు