పెంచిన పన్నుల భారాన్నినిరసిస్తూ కాజిపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. నూతన సంవత్సర కానుకగా తెరాస ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ నగరవాసులపై పన్నుల భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సరైన మౌలిక వసతులు కల్పించకుండా ప్రజలపై పన్నులు మోపడం ఏంటని ప్రశ్నించారు.
'ప్రతియేటా ప్రకటించే 300 కోట్లు ఏమయ్యాయి' - తెలంగాణ వార్తలు
పెంచిన పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పట్టణ జిల్లా కాజిపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రతియేటా వరంగల్ నగరాభివృద్ధికి ప్రకటించే 300 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'ప్రతియేటా ప్రకటించే 300 కోట్లు ఏమయ్యాయి'
వరంగల్ పట్టణ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతియేటా వరంగల్ నగరాభివృద్ధికి 300 కోట్లు ఇస్తామని చెప్పి విస్మరించారని అన్నారు. ఆ నిధుల వివరాలు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పన్నులను తగ్గించని పక్షంలో వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు
TAGGED:
cong dharna