వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వలస కూలీలను తరలించేందుకు గానూ 3 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒడిశాకు చెందిన 3 వేల మంది వలస కూలీలను ఈ ప్రత్యేక రైలు ద్వారా స్వస్థలాలకు తరలిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా, సిద్దిపేట, జగిత్యాల ఇతర ప్రాంతాల నుంచి కూలీలను ఆర్టీసీ బస్సుల ద్వారా ఇక్కడకు తీసుకువచ్చారు.
వలసకూలీలను స్వస్థలాలకు పంపేందుకు రైళ్లు రెడీ... - lock down effect
పలు జిల్లాల్లో ఇరుక్కుపోయిన సుమారు 3 వేల మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 3 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. కూలీలను ఆయా జిల్లాల నుంచి కాజీపేట రైల్వే స్టేషన్కు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించారు.
వలసకూలీలను స్వస్థలాలకు పంపేందుకు రైళ్లు రెడీ...
రైలు ఎక్కే ముందు అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి వారికి మంచినీరు, ఆహార పదార్థాలను అందించి రైలులో ఎక్కిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఇతర పోలీసు అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.