తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి 3 రోజుల పాటు 'టెక్నోజీయాన్' - విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకత

వరంగల్ మహా నగరంలోని నిట్​లో నేటి నుంచి మూడు రోజుల పాటు టెక్నోజీయాన్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఈ వేడుకలు దోహదపడతాయి : నిట్ డైరెక్టర్

By

Published : Nov 1, 2019, 5:21 AM IST

Updated : Nov 1, 2019, 8:50 AM IST

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఈ వేడుకలు దోహదపడతాయి : నిట్ డైరెక్టర్

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్​లో టెక్నోజీయాన్ వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు...నూతన ఆవిష్కరణలతో సరికొత్త ప్రయోగాలతో ఈ సాంకేతిక వేడుకల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 5 వేలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

'సృజనాత్మకత... సాంకేతికత అంశాల్లో ప్రతిభను వెలికితీయాలి'

విద్యార్థులే నిర్వాహకులై అత్యంత సందడిగా జరిగే టెక్నోజీయాన్‌-2019 ఘనంగా ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణలు అనే అంశంతో నవంబర్ 1 నుంచి 3 వరకు వరంగల్ నిట్​లో జరగనున్న ఈ సాంకేతిక వేడుకలను డీఆర్డీవో విశ్రాంత కన్సల్టెంట్ పద్మశ్రీ ఎన్.దివాకర్‌ లాంఛనంగా ప్రారంభించారు. నిట్ సంచాలకులు ఎన్వీ రమణారావు, అడ్రోయిటిక్ సొల్యూషన్ సీఈవో ఆయుష్, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి సాంకేతికత, వైజ్ఞానిక అంశాల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని ఎన్​వి రమణారావు పేర్కొన్నారు.

'టెక్నోజీయాన్ ద్వారా... ప్రతిభను పెంచుకునే అవకాశం'

నేటి నుంచి సాంకేతిక వేడుకలు మొదలుకానున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేలకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. వివిధ అంశాలపై 14 కార్యశాలలు, విద్యార్థి క్లబ్​ల ఆధ్వర్యంలో 55కి పైగా సాంకేతిక, వైజ్ఞానిక అంశాల్లో ఆకట్టుకునే రీతిలో విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భవిష్యత్​ను శాసించే సాంకేతిక పరిజ్ఞానం, నానో టెక్నాలజీ, అంతరిక్ష పరిజ్ఞానం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు తదితర అంశాలపై ప్రసంగించనున్నారు.

సాంకేతికత పరంగా ప్రతిభను పెంచుకునే అవకాశం ఈ వేడుకల ద్వారా కలుగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేయనున్నారు. వేడుకల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంస పత్రాలతో పాటు 4 లక్షల రూపాయల వరకు నగదు బహుమతులను అందజేయనున్నారు.

ఇవీ చూడండి : సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌

Last Updated : Nov 1, 2019, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details