పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం వరంగల్ అర్బన్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంఛార్జీ ఛైర్మన్ జయకుమార్ ప్రారంభించారు.
'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి' - తెలంగాణ తాజా వార్తలు
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంఛార్జీ ఛైర్మన్ జయకుమార్ కోరారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 బెంచ్‌లు ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
!['జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి' lok adalat at warangal urban district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11353093-655-11353093-1618047104061.jpg)
హన్మకొండలో జాతీయ లోక్ అదాలత్
క్రిమినల్, సివిల్, ఆస్తి తగాదా వంటి కేసులను పరిష్కరిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జయకుమార్ కోరారు. సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 26 బెంచ్‌లు ఏర్పాటుచేశారు.
ఇవీచూడండి:ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం