వరంగల్ అర్బన్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడి దాడి చేశాయి. ఈ ఘటన జిల్లాలోని ఐనవోలు మండలంలో చోటుచేసుకుంది. గర్మిల్లపల్లి, వెంకటాపూర్, ఉడుతగూడెం, లింగమోరిగూడెం గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేసి 20 మందిని కరవడం వల్ల తీవ్రగాయాలయ్యాయి.
పిచ్చికుక్కల స్వైరవిహారం... 20 మందికి గాయాలు - dogs news
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని పలు గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. పిచ్చికుక్కల దాడిలో 20 మందికి గాయాలు కాగా.. అందులో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పిచ్చికుక్కల స్వైరవిహారం... 20 మందికి గాయాలు
కుక్కల దాడిలో తీవ్రగాయాలపాలైన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుక్కల దాడితో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
ఇవీ చూడండి:మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!
Last Updated : Feb 18, 2020, 5:44 PM IST