వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 186 మందికి కొవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధరించారు. ఇందులో వరంగల్ అర్బన్‌లో అత్యధికంగా 117 కేసులు నమోదయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో 41, జనగామ 5, ములుగు 2, మహబూబాబాద్ 21 కేసులు వచ్చాయి. ర్యాపిడ్, యాంటిజన్ కిట్ల ద్వారా కొవిడ్ పరీక్షలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడం జిల్లావాసుల్లో ఆందోళన కలిగిస్తోంది.
వరంగల్ అర్బన్ జిల్లాలో 117 కరోనా కేసులు - warangal urban latest corona updates
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇవాళ 186 కేసులు నమోదు కాగా... వరంగల్ అర్బన్ జిల్లాలోనే 117 కేసులు రావడం అందోళన కలిగిస్తోంది.

వరంగల్ అర్బన్ జిల్లాలో 117 కరోనా కేసులు
ఇప్పటికే కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిన నగర మేయర్ గుండా ప్రకాష్ రావు దంపతులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మేయర్‌తో సన్నిహితంగా ఉన్నవారిలో కొందరు హోమ్ క్వారంటైన్లో ఉండగా మరికొందరు పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిలో ఎక్కువ మంది కోలుకోవడం విశేషం.
ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి