వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్లో విద్యార్థులు గంజాయి సేవించడంపై యాజమాన్యం...క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. మొత్తం 11 మంది బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్ధులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన రావు వెల్లడించారు. వీరంతా మళ్లీ కొత్తగా మొదటి సంవత్సరం చదవాల్సి ఉంటుందని తెలిపారు.
11 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు - 11 NIT STUDENTS SUSPENSION
గత నెల 26న ఎన్ఐటీ విద్యార్థులు గంజాయి సేవించడం.. కలకలం రేపింది. దీనిపై నిట్ క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టింది. సమగ్ర విచారణ అనంతరం... విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధరణ కావటం వల్ల వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. జరిమాన కూడా విధించింది.
11మంది విద్యార్థులపై సస్పషన్ వేటు
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో క్రమశిక్షణను ఉల్లఘించే ఈ తరహా ఘటనలను ఉపేక్షించే ప్రసక్తి లేదని వెల్లడించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రార్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం