వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లిలో విషాదం జరిగింది. చొప్పురి కార్తీక్ (16) అనే పదో తరగతి విద్యార్థి... తన పెద్ద నాన్నతో కలిసి పొలం దగ్గరికి వెళ్లాడు. మోటార్ వేసేందుకు వెళ్లగా... విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టార్టర్ బోర్డుకున్న కనెక్షన్ వైర్‌ను ఎలుకలు కొట్టటం వల్ల బోర్డు బాక్స్‌కు కరెంట్‌షాక్ వచ్చి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావటం వల్ల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి - 10TH CLASS STUDENT DIED WITH CURRENT SHOCK IN GOLLAPALLY
పెద్ద నాన్నతో సరదాగా పొలానికి వెళ్లాడు ఆ పదో తరగతి విద్యార్థి. మోటర్ వేయమనగానే చకచకా వెళ్లాడు. మోటర్ వెయ్యాలనే ఆతృతతో స్టాటర్ బాక్స్ తలుపు తీశాడు. కరెంట్‌షాక్ వచ్చి అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. దీనికంతటికీ కారణం... ఆ కనెక్షన్ వైరును ఎలుకలు కొట్టటమే...!
10TH CLASS STUDENT DIED WITH CURRENT SHOCK IN GOLLAPALLY