నిరుద్యోగ భృతిని తక్షణమే విడుదల చేయాలని యూత్ కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతి అంశంపై మాట్లాడకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాలతో ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని భయపడిన ప్రభుత్వం.. అక్రమ అరెస్టులు చేయిస్తున్నారన్నారు.