వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లిలో వరదలో కొట్టుకుపోతున్న తల్లీకుమారుడిని స్థానిక యువకులు కాపాడారు. గుండ్రపల్లి చెరువు మత్తడి పోస్తుండడంతో లోలెవల్ వంతెన మీదుగా వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది(floods). ఆ సమయంలో మడిపల్లి తండాకు చెందిన తల్లీకుమారుడు ద్విచక్రవాహనంపై దాటేందుకు ప్రయత్నం చేశారు. వరద ఉద్ధృతికి వారు కొట్టుకుపోతుండగా స్థానిక యువకులు గమనించి కాపాడారు. ఫలితంగా అతిపెద్ద ప్రమాదం తప్పింది.
Floods: వరదకు కొట్టుకుపోతున్న తల్లీకుమారుడిన కాపాడిన యువకులు - తెలంగాణ వార్తలు
ఓవైపు చెరువు మత్తడి పోస్తున్న లోలెవల్ వంతెన మీదుగా దాటేందుకు ప్రయత్నించారు ఆ తల్లీకుమారుడు. ద్విచక్రవాహనం మీద దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ తల్లీకుమారుడు కొట్టుకుపోతుండగా వెంటనే కొందరు యువకులు సాహసించారు. ఆ తల్లీకుమారుడిని రక్షించారు. యువకుల చొరవతో పెద్ద ప్రమాదం తప్పింది.
వరదకు కొట్టుకుపోతున్న తల్లీకుమారుడిన కాపాడిన యువకులు, యువకుల చొరవ
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ జిల్లాలోని పలు చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అక్కడక్కడా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న తల్లీకుమారుడిని కాపాడిన స్థానిక యువకులు అశోక్, శ్రవణ్, ల్యాకరాజులను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి:TS SCHOOLS REOPEN: రేపు బడులు ప్రారంభిస్తారా లేదా వాయిదా వేస్తారా? సాయంత్రానికి స్పష్టత