మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్ చేసిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా అప్పనికుంటకు చెందిన భరత్... ఎనుమాముల వంద ఫీట్ల క్రాస్ రోడ్ వద్ద హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. తన భార్య కాపురానికి రావడం లేదని... కిందికి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
భార్య కాపురానికి రావట్లేదని హల్చల్ చేసిన యువకుడు - యువకుడు హల్చల్
తన భార్య కాపురానికి రావట్లేదని ఓ యువకుడు వరంగల్‌లో హల్చల్ చేశాడు. మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. చివరకు పోలీసులు రంగ ప్రవేశంతో కిందికి దిగిన యువకున్ని అరెస్టు చేశారు.
![భార్య కాపురానికి రావట్లేదని హల్చల్ చేసిన యువకుడు young man hulchal in warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8223244-946-8223244-1596037884580.jpg)
young man hulchal in warangal
స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా... హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంట సేపు శ్రమించి భరత్‌ను కిందకి దింపారు. తన భార్యను కాపురానికి పంపించాలని పోలీసులను భరత్ కోరాడు. ఆత్మహత్యతు యత్నించిన భరత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.