తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులు విచారించారని పురుగుల మందు తాగిన యువకుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే? - గీసుకొండ పోలీసు స్టేషన్​లో యువకుడు మృతి

young man committed suicide in Warangal: మెదక్​లో ఖదీర్​ఖాన్​ థర్డ్​ డిగ్రీ.. పోలీసులు కొట్టారని యువకుడు కరెంట్​ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరువక మునుపే ఆ తరహా ఘటనే వరంగల్​లో ఇవాళ చోటుచేసుకుంది. పోలీసులు విచారణకు పిలిచారన్న అవమానాన్ని తట్టుకోలేక యువకుడు పురుగుల మందు తాగి విచారణకు స్టేషన్​ వద్దకు వెళ్లాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?

young man committed suicide
young man committed suicide

By

Published : Mar 7, 2023, 7:48 PM IST

young man committed suicide in Warangal: గత కొంత కాలంగా పోలీసుల విచారణలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో క్రమంగా పెరిగిపోతున్నాయి. గత నెల వ్యవధిలో మెదక్​ జిల్లాలోనే ఇలాంటి ఘటనలు రెండు చూశాం. పోలీసుల థర్డ్​ డిగ్రీతో ఖదీర్​ ఖాన్​ అనే వ్యక్తి మరణించగా.. ఆ తరువాత కొద్ది రోజుల వ్యవధిలోనే పోలీసులు కొట్టారని కారణంతో యువకుడు కరెంట్​ స్తంభం ఎక్కి కరెంట్​ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చూశాం. ఇప్పుడు అలాంటి తరహా ఘటనే వరంగల్​ జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది.

ఇది జరిగింది:పోలీసులు విచారణకు పిలిచారని అవమానాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి వరంగల్​లో యువకుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన కుమారస్వామి ఇంట్లో ఈనెల 1వ తేదీన దొంగతనం జరిగింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కుమారస్వామిని పోలీసులు విచారించగా.. ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించారు. దీనికి అతను తన కుమారుడు మనోజ్​తో పాటు అతని స్నేహితుడు వంశీ కృష్ణ మీద అనుమానం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో సోమవారం గీసుకొండ పోలీసులు వంశీని విచారించారు. ఇవాళ మళ్లీ విచారణకు హాజరుకావాలని పోలీసులు సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ.. పురుగులు మందు తాగి విచారణకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టేషన్​ ముందుకు రాగానే కుప్పకూలిపోయాడు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృత దేహాన్ని మార్చురీకి తరలించారు.

ఈ ఘటనతో స్థానికులు, వంశీ కుటుంసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయారని... బాధ్యులపై పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలు ఖండించారు. బాధితుడు చేసిన ఫిర్యాదులో భాగంగానే విచారణ కోసం పిలిచామని చెబుతున్నారు. అయితే విచారణ పేరుతో కొట్టడం, తిట్టడం వల్లే తమ కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వంశీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details