వరంగల్ రూరల్ జిల్లా పుల్కుర్తి దేవాదుల పంప్‌హౌస్ వద్ద ఒప్పంద కార్మికులు ధర్నాకు దిగారు. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి కారణాలు లేకుండా తొలగించాలనుకోవడం సరైంది కాదని ఆందోళన చేపట్టారు. దేవాదుల పంప్‌హౌస్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడతామంటూ నినాదాలు చేశారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని 50 మంది ఒప్పంద కార్మికులు నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. కార్మికులతో అధికారులు మంతనాలు జరిపారు.
దేవాదుల పంప్‌హౌస్ వద్ద కార్మికుల ధర్నా - దేవాదుల పంప్‌హౌస్
దేవాదుల పంప్‌హౌస్ వద్ద సుమారు 50 మంది ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు. సరైన కారణాలు లేకుండా కార్మికులను తొలగించాలనుకోవడం సరైందని కాదని ధర్నా నిర్వహించారు.
![దేవాదుల పంప్‌హౌస్ వద్ద కార్మికుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4018164-thumbnail-3x2-md.jpg)
కార్మికుల ధర్నా