తెలంగాణ

telangana

ETV Bharat / state

women's empowerment: మహిళల ఆర్థిక స్వావలంబన.. వాటితో నెలకు రూ.80 వేల ఆదాయం - womens self employment

women's empowerment: సరైన వేదిక, కాస్త ప్రోత్సాహం దొరికితే ఏదైనా సాధించగలరని నిరూపిస్తున్నారు వరంగల్‌ జిల్లా నారీమణులు. స్వయం సహాయక సంఘాల సాయంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు.

women's empowerment:
మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదుగుదల

By

Published : Mar 8, 2022, 10:32 PM IST

women's empowerment: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన వీరంతా నిరుపేద మహిళలే. రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ పూటగడిపేవారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మహిళా సంఘాలుగా ఏర్పడి ఆర్థికంగా ఎదిగారు. వడ్డీలేని రుణాలతో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. సమాజంలో తమకంటూ గౌరవం సంపాదించారు.

టీ కొట్టుతో జీవనోపాధి: సరిత

కుటీర పరిశ్రమలతో నిలదొక్కుకుంటున్న మహిళలు
సంకల్పం ఉండాలే గానీ దివ్యాంగం, ఆర్థిక పరిస్థితులు ఏవీ తమ ఎదుగుదలకు అడ్డురావని నిరూపించింది ఇదే ప్రాంతానికి చెందిన సరిత. స్వయం సహాయక సంఘంలో రుణం ద్వారా టీ కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది.
మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదుగుదల


పిల్లల ఫీజులు నేనే కడుతున్నా: మౌనిక

మహిళా సంఘాల ప్రోత్సాహంతో ఇంట్లోనే దుస్తుల దుకాణం నిర్వహిస్తోంది మౌనిక. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు తానే చూసుకుంటూ సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లల స్కూలు ఫీజును తానే కడుతున్నాని గర్వంగా చెబుతోంది.

కుటీర పరిశ్రమలతో నిలదొక్కుకుంటున్న మహిళలు


నెలకు రూ.80 వేల వరకు ఆదాయం

ఇల్లందు గ్రామంలో సుమారు 50మందికి పైగా మహిళలు...సొంతంగా ఉపాధి చూసుకుంటూ...ఆర్ధికంగా స్ధిరపడుతున్నారు. చాక్‌పీసుల తయారీ, చీరలు, ఎంబ్రాయిడరీ వర్క్స్‌ తదితర పనుల ద్వారా ఒక్కొక్కరూ నెలకు రూ.50 నుంచి రూ.80 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఐకేపీ రుణాలతో ఆర్థికంగా బలంగా నిలబడ్డారు. ధైర్యంగా ముందుకొస్తే... మహిళ ఏదైనా సాధించగలదని ఇల్లందు మహిళలు నిరూపిస్తున్నారు. చాలా చోట్ల మహిళలకు ప్రోత్సాహం దక్కడం లేదని కొంచెం దన్నుగా నిలిస్తే... మహిళలు అద్భుతాలు సాధిస్తారని ఇల్లందు వనితలు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details