తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్టు షాపులు మూసేయండి..మహిళల రాస్తారోకో.. - warangal rural womens protest on road

వరంగల్ గ్రామీణ జిల్లాలో మద్యం షాపులను నిషేధించాలని చెన్నారావుపేట గ్రామ మహిళలు ధర్నా చేపట్టారు.

బెల్టు దుకాణాలు బంద్ చేయాలని రోడ్డెక్కిన మహిళలు

By

Published : Oct 27, 2019, 2:24 PM IST

తమ గ్రామంలో బెల్టుషాపులను నిషేధించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో మహిళలు రాస్తారోకో నిర్వహించారు. రోజు రోజుకు బెల్టుషాపులు పెరిగిపోయి యువకులంతా తాగుడుకు బానిసై కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కాపాడుకోవడం కోసం మద్యం దుకాణాలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. నెక్కొండ నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడం వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడి మహిళల ఆందోళనను శాంతింపచేశారు.

బెల్టు దుకాణాలు బంద్ చేయాలని రోడ్డెక్కిన మహిళలు
ఇవీ చూడండి : రెండు క్వింటాళ్ల 80 కేజీల గంజాయి పట్టివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details