తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం దుకాణం ముందు మహిళల ఆందోళన - వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని దుర్గా మద్యం దుకాణం ముందు మహిళలు ధర్నా

జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మహిళలు ఆందోళన నిర్వహించారు.

మద్యం దుకాణం ముందు మహిళల ఆందోళన

By

Published : Oct 18, 2019, 3:07 PM IST

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని దుర్గా మద్యం దుకాణం ముందు మహిళలు ధర్నా చేపట్టారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం నిర్వహించడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళనకు దిగారు. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, జనావాసాలకు దూరంగా తరలించాలని మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా అనుమతులు ఇవ్వడం వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు.

మద్యం దుకాణం ముందు మహిళల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details