గర్భిణీకి అంబులెన్సులోనే సిబ్బంది ప్రసవం చేసిన సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో జరిగింది. పర్వతగిరి మండలం దేవీలాల్ తండాకు చెందిన ధరావత్ శిరీషకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. వర్ధన్నపేట అంబులెన్సు సిబ్బంది శిరీషను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.
AMBULANCE: అంబులెన్స్‌లో ప్రసవం... తల్లీ, బిడ్డ క్షేమం - అంబులెన్సులోనే గర్భిణీ ప్రసవం
వరంగల్ గ్రామీణ జిల్లాలో 108 సిబ్బంది తల్లీ, బిడ్డ ప్రాణాలు కాపాడారు. అంబులెన్సులోనే గర్భిణీకి ప్రసవం చేసిన సిబ్బంది మంచి మనసును చాటుకున్నారు. పర్వతగిరి మండలం దేవిలాల్ తండాకు చెందిన గర్భిణీ అంబులెన్స్‌లో తరలిస్తుండగా నొప్పులు అధికం కావడంతో సిబ్బంది ప్రసవం చేశారు. ప్రస్తుం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు తెలిపారు.
![AMBULANCE: అంబులెన్స్‌లో ప్రసవం... తల్లీ, బిడ్డ క్షేమం Women delivered in Ambulance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12222505-193-12222505-1624352774766.jpg)
Women delivered in Ambulance
అప్రమత్తమైన అంబులెన్సు సిబ్బంది జాగ్రత్తలు పాటిస్తూ పండంటి ఆడబిడ్డకు పురుడు పోసింది. అనంతరం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సరైన సమయానికి స్పందించిన అంబులెన్సు సిబ్బంది రవితేజ, రాజును ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీ బంధువులు అభినందించారు.