తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసిన భార్య - Wife assaulting alcoholic husband

భర్త నిత్యం మద్యం సేవించేవాడు.. ఇంటికొచ్చాక భార్యను వేధించేవాడు. కొన్ని రోజులు భార్య ఓపిక పట్టింది.. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు తన తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసింది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో జరిగింది.

Wife attacks husband with sticks along with mother at erracheruvu thanda warangal rural
తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసిన భార్య

By

Published : Jul 22, 2020, 8:00 PM IST

నిత్యం మద్యం సేవించి భార్యను వేధిస్తున్న భర్తపై తన తల్లితో కలిసి కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. నల్లబెల్లి మండలం ఎర్రచెరువు తండాకు చెందిన లావుడ్య బాల్​సింగ్ నిత్యం తాగొస్తూ తన భార్యను వేధింపులకు గురిచేసేవాడు.

ఈ క్రమంలో విసుగు చెందిన భార్య రమ్య తన తల్లితో కలిసి కర్రలతో దాడి చేసింది. సమాచారం తెలుసుకున్న నల్లబెల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాల్​సింగ్​ను ఆస్పత్రికి తరలించారు.

తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసిన భార్య

ఇదీ చూడండి :రైలింజన్ ఢీకొని.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details