తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2020, 7:22 AM IST

ETV Bharat / state

జిల్లాలో విస్తారంగా వర్షాలు... పొంగిపొర్లుతున్న ఆకేరు వాగు

వరంగల్ గ్రామీణ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలం ఆరంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురవడం పట్ల జిల్లా రైతలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు.

Widespread rains in the warangal ruurl district and overflowing akeru Stream
జిల్లాలో విస్తారంగా వర్షాలు... పొంగిపొర్లుతున్న ఆకేరు వాగు

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ గ్రామీణ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వానాకాలం ఆరంభంలోనే వానలు సమృద్ధిగా పడుతుండటం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details