తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. కోలుకునే వారూ పెరుగుతున్నారు' - Dmho madhusudhan latest News

లాక్​డౌన్ అమలు కాలంలో కరోనా వైరస్ కేసులు తక్కువగా ఉన్నా వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా... కోలుకునేవారి సంఖ్య గణనీయంగా మెరుగుపడుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

'కరోనా కేసులు పెరుగుతున్నా.. కోలుకునే వారూ పెరుగుతున్నారు'
'కరోనా కేసులు పెరుగుతున్నా.. కోలుకునే వారూ పెరుగుతున్నారు'

By

Published : Jul 16, 2020, 8:07 PM IST

లాక్​డౌన్ సడలింపుల కన్నా ముందు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వర్ధన్నపేట, పరకాల నర్సంపేట ప్రాంతాల్లో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేసులు 88కు చేరుకున్నాయని... సంఖ్య పెరుగుతున్నా.. కోలుకునేవారి సంఖ్య కూడా అదే స్ధాయిలో ఉండటం శుభ పరిణామమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూధన్ తెలిపారు. క్యాన్సర్, తదితర దీర్ఘకాలిక రోగులూ క్రమంగా కోలుకుంటున్నారని వెల్లడించారు.

1175 ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు..

జిల్లాలో పరీక్షలు పెద్ద మొత్తంలో నిర్వహిస్తున్నామని.. 1175 ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పాజిటివ్ వచ్చిందనే భయం ఆరంభంలో ఉన్నా తగ్గుతుందన్న విశ్వాసం చాలా మందిలో కనబడుతోందని పేర్కొన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం, పాజిటివ్ నిర్ధరణ అనంతరం ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతోనే కరోనాను నియంత్రించగలమంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ఇవీ చూడండి :పరీక్షలు పెంచండి: మంత్రి ఈటలతో కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details