గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. భీమారం, చింతగట్టు, హసన్ పర్తిలలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం.. మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ కాసేపు సందడి చేశారు.
'విలీన గ్రామాల్లో.. పట్టణ వాతావరణం తీసుకొస్తా' - ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్యటించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
విలీన గ్రామాల్లో.. పట్టణ వాతావరణం తీసుకొచ్చేందుకు నిత్యం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సిద్దిపేటలో అత్యాధునిక హంగులతో గ్రంథాలయం