తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - warangal rural district news

వర్ధన్నపేట మండలం రాందాన్​ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్​ ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమని ఆయన అన్నారు.

wardhannapet mla aroori ramesh inaugurated paddy purchase center at ramdhan thanda in warangal rural district
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Nov 12, 2020, 7:43 PM IST

రైతులను ఆర్ధికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం రాందాన్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

రాష్ట్రం ఏర్పడ్డాక రైతుల సంక్షేమానికి తెరాస ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో వ్యవసాయం పండగలా సాగుతోందన్నారు. రైతులు రైతు వేదికలను వినియోగించుకుని లాభసాటి వ్యవసాయం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇవీ చూడండి:'సన్నాల సాగుకు రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది'

ABOUT THE AUTHOR

...view details