నేటి యువత వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 158 జయంతిని పురస్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
'స్వామి వివేకానందుని జీవితం ఆదర్శప్రాయం' - స్వామి వివేకానందుని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆరూరి రమేశ్
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత వివేకానందునిదేనని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
'స్వామి వివేకానందుని జీవితం ఆదర్శప్రాయం'
ప్రపంచానికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసిన ఘనత వివేకానందునికే దక్కుతుందని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. చిన్న వయసులోనే ప్రపంచ దేశాలు తిరిగిన ఆయన తన ఉపన్యాసాల ద్వారా యువతను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించి భారత యువతకు దిశ నిర్దేశం చేసిన స్వామి వివేకానంద చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని పేర్కొన్నారు.