ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

పదవులకు, బహిరంగ సభలకు.. వరంగల్​ జిల్లానే నెంబర్​ వన్ - Leaders

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ (Warangal Political Leaders)​కు పెద్దపీట లభించడంపై గులాబీ సేనలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి ముగ్గురికి మండలి సభ్యత్వం దొరకడంతో.. జిల్లాకు సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మంత్రివర్గంలోనూ మరో బెర్తు జిల్లాకు ఖాయమన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.

Warangal Political Leaders
వరంగల్​ జిల్లానే నెంబర్​ వన్
author img

By

Published : Nov 19, 2021, 12:18 PM IST

వరంగల్​ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉన్న ప్రత్యేక అభిమానం అందరికీ తెలిసిందే. అందుకే సాధ్యమైనంతవరకూ ఏ కార్యక్రమమైనా.. భారీ బహిరంగసభలైనా ముందు ఓరుగల్లు (Warangal Political Leaders)లో ఉంటాయి. తెరాస పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించాలనుకున్న విజయగర్జన కూడా.. మిగతా జిల్లాల పేర్లను పరిశీలించకుండానే… ఓరుగల్లు (Warangal Political Leaders)ను ఖరారు చేశారంటే.. ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.

ముగ్గురికి మండలి అవకాశం

ఇక పదవుల భర్తీలో కూడా వరంగల్​ జిల్లా (Warangal Political Leaders)కే ఎక్కువ అవకాశాలుంటాయన్నది తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. జిల్లా (Warangal Political Leaders)కు అనూహ్యంగా మండలిలో ప్రాధాన్యం పెరిగింది. మూడు ఎమ్మెల్సీలు ఒకే జిల్లాకు దక్కడంతో.. ఎమ్మెల్సీల స్థానంలో రాష్ట్రంలోనే వరంగల్​ (Warangal Political Leaders) ముందువరుసలో నిలుచుంది. అందరూ ఊహించినట్లుగానే జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్​లకు ఎమ్మెల్సీ టికెట్ లభించగా.. ఎవరూ ఊహించని విధంగా బండా ప్రకాశ్​కు మండలి ప్రాతినిధ్యం లభించింది. ఆరుగురి ఎమ్మెల్సీల్లో.. ముగ్గురు జిల్లా వారు కావడం విశేషమే మరి.

మంత్రివర్గంలో కూడా..

ఇదే కాకుండా... తాజాగా మంత్రివర్గంలో మరో బెర్తు కూడా వరంగల్ (Warangal Political Leaders)​కు ఖాయమన్న ప్రచారమూ విస్తృతంగా జరుగుతోంది. అయితే మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుందనే అంశం... ఇప్పుడు జిల్లా (Warangal Political Leaders)లో హాట్ టాపిక్​గా మారిపోయింది. బండా ప్రకాశ్​నే మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు... ముదిరాజ్ సామాజికవర్గానికే చెందిన బండా ప్రకాశ్​ను మంత్రిపదవి వరిస్తుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి సైతం వరిస్తుందనే ప్రచారమూ జరుగుతోంది.

ఆ ఒక్కరితో ముగ్గురు మంత్రులు

అలాగే మంత్రిగా అనుభవం ఉన్న సీనియర్ నేత... కడియం శ్రీహరి కూడా ఈసారి ఆశాభావంతోనే ఉన్నారు. ఇరువురిలో ఎవరికి అమాత్య పదవి వచ్చినా.. జిల్లా (Warangal Political Leaders)కు ముగ్గురు మంత్రులు ఉన్నట్లే. ఇప్పటివరకు జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్​లు మంత్రులుగా ఉండగా.. కొత్తగా ఇద్దరిలో ఒకరు ఎంపికైతే.. జిల్లా (Warangal Political Leaders)కు సంబంధించి ముగ్గురు మంత్రులవుతారు. శాసనమండలి ఛైర్మన్​గా కూడా కడియం శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పదువుల పందేరంలో ఓరుగల్లు (Warangal Political Leaders)కు అధిక వాటా లభించడంపై.. జిల్లాలోని తెరాస నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు జిల్లాపై గల మక్కువకు ఇదే నిదర్శనమని చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు జిల్లా (Warangal Political Leaders)కు వరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల్లో ముగ్గురు జిల్లాకు చెందిన వారే ఉండడం.. మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు బరిలో ఉండడంతో... ఇప్పటిదాకా మంత్రి పదవి రేసులో ఉన్న పలువురు ఎమ్మెల్యేల ఆశలు గల్లంతయ్యాయి.

ఇవీ చూడండి:MLC Madhusudhanachari : గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

TRS MLC Candidates: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తులెంతో తెలుసా..? ఎన్ని కేసులున్నాయంటే..?

ABOUT THE AUTHOR

...view details