తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం అవసరం' - Warangal Rural Zp Meeting

సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజాప్రతినిధులు... అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని వరంగల్‌ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. గ్రామాల్లో పెండింగ్​లో ఉన్న పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Warangal Rural Zp Meeting Held by ZP Chair Person Gandra Jyothi
'ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం అవసరం'

By

Published : Sep 13, 2020, 8:40 PM IST

హన్మకొండలోని జడ్పీ సమావేశ మందిరంలో వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యేలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న నర్సరీలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అధికారులను అదేశించారు. ప్రతి ఒక్కరూ విధులను బాధ్యతగా నిర్వహిస్తే జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి అన్నారు. జిల్లా అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని తెలిపారు.

ఇవీచూడండి:వీధుల్లో స్ప్రే చేసిన ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్​పర్సన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details