తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం తరలింపునకు లారీలు లేక రైతుల ఇబ్బందులు - farmers protest in warangal rural district

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాలంగా వర్షాలు కురుస్తుండటం వల్ల ఆరుగాలం పడిన కష్టమంతా వృథా అవుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

warangal rural farmers protest demanding lorries to move grain
ధాన్యం తరలింపునకు లారీలు లేక రైతుల ఇబ్బందులు

By

Published : Jun 2, 2020, 3:41 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తరలించడానికి లారీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీల్లో లోడ్ చేయడం, మిల్లర్ల వద్ద అన్​లోడ్​ చేయడం పూర్తిగా తమ మీదే భారం పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము అరిగోస పడుతున్నామని కర్షకులు వాపోయారు. లారీ అసోసియేషన్​లతో మాట్లాడి సరిపడా లారీలు పంపించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details