ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు కలత చెందుతున్నారని వరంగల్ గ్రామీణ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుపడతాయని భావించిన యువతకు నిరాశే మిగిలిందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో.. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఆలోచించకుండా కమీషన్లతో కాంట్రాక్టర్ల కడుపు నింపుతోందని ఆరోపించారు.
కొలువు కోసం కొట్లాడదాం... ఉద్యోగాలను సాధించుకుందాం! - job notifications
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వరంగల్ గ్రామీణ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని.. యువత ధైర్యంగా ముందడుగేసి కొలువు కోసం కొట్లాడాలని అన్నారు.
వరంగల్, కాంగ్రెస్
ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి.. ఇక రాదని మనస్తాపానికి గురై మహబూబాబాద్ జిల్లాకు చెందిన సునీల్ నాయక్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రం కోసం ఎలాగైతే ప్రాణాలకు తెగించి పోరాడమో.. ఉద్యోగాల కోసమూ అలాగే పోరాడదామని చెప్పారు. నిరుద్యోగ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు బుద్ధి చెప్పేలా పోరాడదామని తెలిపారు.
- ఇదీ చదవండి :చిట్కుల్ గ్రామ శివారులో మహిళ దారుణ హత్య