తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన పోలీసులు - రోడ్డు ప్రమాదాలుపై అవగాహన కల్పించిన పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను వరంగల్ గ్రామీణ జిల్లా పోలీసులు తెలిపారు. వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వాహనదారులకు వివరించారు. మీ రక్షణ.. మా బాధ్యత అంటూ ప్రమాదాల పట్ల ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

Warangal Rural District Police raising awareness on road accidents
రోడ్డు ప్రమాదాలపై అవగాహణ కల్పిస్తున్న పోలీసులు

By

Published : Mar 21, 2021, 8:16 PM IST

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వరంగల్​ గ్రామీణ జిల్లా పోలీసులు నడుం బిగించారు. ట్రాఫిక్​ నియమాలను పాటించకపోవడం కారణంగా ఎదురయ్యే ప్రమాదాలను వాహనదారులకు వివరించారు. మీ రక్షణ.. మా బాధ్యత అంటూ వారికి అవగాహన కల్పించారు.

రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న వాహనాలను అడ్డుకుని వారిని ప్రశ్నించారు. ఇన్సూరెన్స్, ఆర్సీ, లైసెన్స్, హెల్మెట్ వాడకుండా ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో నిబంధనలు అతిక్రమించిన పలు వాహనాలను సీజ్ చేశారు. మరోసారి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదంవండి:ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తెరాస గెలిచింది: కోదండరామ్

ABOUT THE AUTHOR

...view details