పచ్చదనంలో పోటీ పడుతున్న ఓరుగల్లు వాసులు రాష్ట్రమంతా పచ్చదనంతో ప్రణవిల్లాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో వరంగల్ గ్రామీణ జిల్లాలో హరితహారం కార్యక్రమం పోటాపోటీగా నడుస్తోంది. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ హరిత పిలుపునివ్వడం వల్ల యుద్ధప్రాతిపదికన హరితహారం కొనసాగుతోంది.
ఇందులోనూ ముందుంటాం
ముఖ్యంగా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి, మరియాపురం, నందనాయక్ తండా, దస్రు తండాలలో పోటాపోటీగా మొక్కలు నాటుతున్నారు. ఉత్తమ గ్రామపంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గంగదేవిపల్లి హరితహారంలోనూ ముందుండాలని ప్రయత్నిస్తోంది.
సంరక్షణా మా బాధ్యతే
మరియాపురంలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. గ్రామ సర్పంచ్ తన సొంత డబ్బులతో పదివేల మొక్కలను కడెం నుంచి కొనుగోలు చేసి నాటించారు. పెట్టిన ప్రతి మొక్కను బతికించడం కోసం కొందరు సర్పంచులు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసుకున్నారు.