వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూడ్రోజుల నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ హరిత కేంద్రాన్ని సందర్శించారు.
'రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు' - grain purchase center in nallabelli
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
వర్ధన్నపేటలో కలెక్టర్ హరిత పర్యటన
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని ఐకేపీ నిర్వాహకులను కలెక్టర్ మందలించారు. కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా... రైతులు తమను సంప్రదించాలని సూచించారు.