కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ రోజూ కూలీ చేసుకుని బతికే వారి పాలిట శాపమైంది. వీరిని ఆదుకోవడానికి పలు చోట్ల దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
వరంగల్ గ్రామీణ జిల్లాను తాకని కరోనా వైరస్ - no corona positive cases in warangal rural district
కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో రోజూవారి కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారిని ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో 300 పేద కుటుంబాలకు పద్మశాలి సంఘం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.
వరంగల్ గ్రామీణ జిల్లాను తాకని కరోనా వైరస్
ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దాతలను అభినందించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని, ఇక ముందు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ గుంటి రజని, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్ పాల్గొన్నారు.