తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్ధన్నపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి: అదనపు కలెక్టర్ - warangal rural district latest news

నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పట్టణాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు.

warangal rural district additional collector visits wardhannapet municipality
వర్ధన్నపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి: అదనపు కలెక్టర్

By

Published : Dec 16, 2020, 12:03 PM IST

వర్ధన్నపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చి దిద్దాలని వరంగల్ గ్రామీణ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని... అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.

పట్టణాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ముందుకు సాగాలన్న ఆయన... ఎలాంటి సమస్యలున్నా తమను సంప్రదించాలని అధికారులకు చెప్పారు.

ఇదీ చదవండి:ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ సూపర్​వైజర్ సస్పెండ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details