వరంగల్ గ్రామీణ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.
'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం' - మున్సిపల్ ఎలక్షన్స్
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ గ్రామీణ కలెక్టర్ హరిత తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాం'