తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ఆన్​లైన్ తరగతులు వినే అవకాశం కల్పించాలంటూ... వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ఓ బాలిక జిల్లా కలెక్టర్ హరితను అభ్యర్ధించింది. చదువుకోవాలన్న ఆమె తపన చూసి కలెక్టర్ స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు.

Warangal Rural collector  Saritha Gift smart phone for a poor girl Samatha
బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

By

Published : Jul 14, 2020, 1:08 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం ఊకల్​కు చెందిన బాలిక సమత చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. డాక్టర్ కావాలన్న తన కలలకు కళ్లెమేసి.. పెళ్లి చేయాలని యత్నించిన పెద్దలను ధైర్యంగా ఎదిరించింది. బాల్య వివాహం చేస్తున్నారంటూ జిల్లా సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేసింది.

వర్ధన్నపేట కేజీబీవీలో ఇంటర్ చదివిన బాలిక 886 మార్కులతో టాపర్​గా నిలిచింది. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఉన్నా...ఆన్​లైన్ తరగతులు వినేందుకు సమత వద్ద స్మార్ట్​ ఫోన్ లేదు. తన పరిస్ధితిని జిల్లా కలెక్టర్​కు లేఖ ద్వారా తెలియచేయగా.. స్పందించిన కలెక్టర్ ఆమెకు స్మార్ట్​ ఫోన్​ని కానుకగా ఇచ్చారు. బాగా చదువుకొని డాక్టరవ్వాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details