వరంగల్ గ్రామీణ జిల్లాలో నూతన గోదాముల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అందుకు ప్రభుత్వ స్థలాలే అనువుగా పరిశీలన చకచకా సాగుతోంది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో జిల్లా కలెక్టర్ హరిత రెవెన్యూ అధికారులతో కలిసి గోదాముల నిర్మాణానికి ప్రభుత్వ భూములను పరిశీలించారు.
గోదాముల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం కసరత్తు - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్థన్నపేట, రాయపర్తి మండలాల్లో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ హరిత అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరగా గోదాములు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు.
గోదాముల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం కసరత్తు
ఖరీఫ్ పంటల చివరినాటికి గోదాములు అందుబాటులోకి తెచ్చేవిధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అందుకు ఎలాంటి సమస్యలు తలెత్తినా.. తమ దృష్టికి తేవాలని అధికారులను కలెక్టర్ కోరారు.
ఇవీ చూడండి: మండల అధికారుల పనితీరు భేష్ : హారీశ్‌రావు