వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని మన దేశం నుంచి ప్రపంచ వారసత్వ హోదాకై యునెస్కోకు ఈ ఏడాది ప్రతిపాదించారని ప్రభుత్వ మాజీ సలహాదారు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ బి.వి.పాపారావు అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. యునెస్కో ప్రతినిధులు రామప్పకు విచ్చేసి ఆలయ విశిష్టతలను పరిశీలించి వారసత్వ హోదాపై ప్రకటన చేస్తారని వివరించారు.
యునెస్కో గుర్తింపు దిశగా రామప్ప - ప్రభుత్వ మాజీ సలహాదారు
కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప దేవాలయం అద్భుత శిల్ప సంపదకు పెట్టింది పేరు. చారిత్రక విశిష్టత కలిగిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు కోసం యునెస్కోకు ప్రతిపాదించబడింది. ఈ దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభిస్తే రామప్ప వైభవం విశ్వవ్యాప్తమవుతుంది.
యునెస్కో గుర్తింపు