చెరువులు మాయమైనందు వల్లే వరంగల్‌కు వరదల ముప్పు వస్తోందని ఎన్‌ఐటీ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు అభిప్రాయపడ్డారు. వరంగల్ పరిసరాల్లో 247 చెరువులు ఉండాలి, కానీ ప్రస్తుతం 52 చెరువులు కనిపించడం లేదన్నారు. చెరువులు ఆక్రమించి కాలనీలు నిర్మించారని అన్నారు.
చెరువులు మాయమైనందు వల్లే వరంగల్లో వరదలు! - warangal nit professor panduranga latest news
వరంగల్లో చెరువులు మాయమైనందువల్లే వరదల ముప్పు ఎదురైందని ఎన్‌ఐటీ విశ్రాంత ఆచార్యులు, కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావు అభిప్రాయపడ్డారు. కాకతీయులు పక్కా ప్రణాళికతో ఓరుగల్లు చుట్టూ చెరువులు నిర్మిస్తే అవి ప్రస్తుతం కనిపించకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పరిసరాల్లో 247 చెరువులు ఉండాలని.. కానీ అందులో 52 చెరువులు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. చెరువులు ఆక్రమణలు చేసి కాలనీలుగా నిర్మించినందువల్లే... వర్షపు నీరు నగరంలోకి వచ్చి ముంచేస్తోందని తెలిపారు. చారిత్రక నగరికి.. భూగర్భ మురుగు నీటి వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటంటున్న పాండురంగారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.
చెరువులు మాయమైనందు వల్లే వరంగల్లో వరదలు!
కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సూత్రాన్ని తెంచేయడం వల్లే ప్రమాదం ముంచుకోస్తుందని తెలిపారు. చారిత్రక నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటుని చెప్పారు. నాలాలను విస్తృత పరిచి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేలా ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు