వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు వరద నీటి ప్రవాహ ధాటికి కొట్టుకుపోయిన.. వరంగల్- ఖమ్మం రహదారి వంతెన మార్గం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ప్రధాన రహదారి కావడం వల్ల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వేగంగా పనులు పూర్తి చేయిస్తున్నారు. వంతెన రోడ్డు అనుసంధాన మార్గ పనులను దగ్గరుండి యుద్ధ ప్రతిపాదికన చేయిస్తున్నారు. ఆగస్టు 24 వరకల్లా పనులు పూర్తై వాహనాల రాకపోకలు మొదలవుతాయని అధికారులు తెలిపారు.
చకచకా సాగుతున్న కోనారెడ్డి వంతెన పనులు!
వరద నీటి ప్రవాహం ధాటికి కొట్టుకుపోయిన వరంగల్ - ఖమ్మం రహదారి వంతెన పనులు అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పరిధిలోని కోనారెడ్డి చెరువు వంతెన వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
చకచకా సాగుతున్న కోనారెడ్డి వంతెన పనులు!