కాకతీయ యూనివర్సిటీ వార్షిక బడ్జెట్ రూ.332.92 కోట్లకు ఆమోదం పొందింది. కామర్స్ విభాగం డీన్ వరలక్ష్మి పద్దును ప్రవేశపెట్టారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.90.94 కోట్లు కేటాయించిందని తెలిపారు. రెవెన్యూ రూ.214.15 కోట్లు లోటుగా చూపించారు. దీనిని అంతర్గత నిధుల నుంచి సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. ఇతర వనరులు రూ.28.66 కోట్లు రానున్నాయి. అభివృద్ధి పనులకు రూ.13.09 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
అన్ని సేవలు ఆన్లైన్లోనే