వరంగల్ జిల్లాలో.. ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని తీర్చి పలువురి ప్రశంసలను పొందింది ఓ మహిళా కానిస్టేబుల్. గీసుకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అనూష.. ప్రధాన రహదారులపై జీవిస్తున్న అభాగ్యులకు ఆహారం అందించింది.
మొదటి జీతాన్నిపేదలకు ఉపయోగించిన పోలీస్ - geesukonda police constable
ఓ పోలీస్ కానిస్టేబుల్ రహదారులపై జీవిస్తున్న అభాగ్యుల ఆకలిని తీర్చి మానవత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
మొదటి జీతాన్నిపేదలకు ఉపయోగించిన పోలీస్
నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక ఇబ్బందులను ఎదుర్కుని కానిస్టేబుల్ ఉద్యోగం సాధించానని తెలిపిన ఆమె.. తన మొదటి జీతాన్ని నిరుపేదల ఆకలిని తీర్చేందుకు ఉపయోగించాలనుకున్నట్లు తెలిపింది. అనూష చేసిన సేవలను పలువురు ప్రశంసించారు.
ఇదీ చదవండి:అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు ఈడీ కోర్టు బెయిల్ నిరాకరణ