తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్లేడుతో గొంతు కోసుకుని వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం.. కారణం తెలిస్తే..! - VRA suicide attempt latest news

VRA Suicide Attempt IN Nekkonda: వరంగల్‌ జిల్లా నెక్కొండలో బ్లేడుతో గొంతు కోసుకుని ఓ వీఆర్ఏ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ డిమాండ్ల సాధన కోసం 69 రోజులుగా దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే కారణంతో వీఆర్​ఏ మహమ్మద్ ఖాసీం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

VRA suicide attempt
VRA suicide attempt

By

Published : Oct 1, 2022, 8:10 PM IST

ప్రభుత్వం తమను పట్టించుకోవ‌‌ట్లేదంటూ వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం

VRA Suicide Attempt IN Nekkonda: వరంగల్‌ జిల్లా నెక్కొండలో బ్లేడుతో గొంతు కోసుకుని వీఆర్​ఏ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. పదోన్నతులు, వేతన సవరణ సహా పలు డిమాండ్ల సాధన కోసం గ్రామ సహాయకులు 69 రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని మనస్తాపానికి గురైన గుండ్రపల్లి గ్రామానికి చెందిన వీఆర్​ఏ మహమ్మద్ ఖాసీం ఆత్మహత్యకు యత్నించాడు.

నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్ష శిబిరం వద్ద వీఆర్ఏ మహమ్మద్ ఖాసీం బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. గమనించిన తోటి వీఆర్​ఏలు మహమ్మద్‌ ఖాసీంను అడ్డుకొని.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామ సహాయకులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వారు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details